"బహుభార్యత్వం"పై నిషేధం !

Telugu Lo Computer
0


సోంలో బహుభార్యత్వాన్ని తక్షణమే నిషేధించాలని ప్రభుత్వం కోరుకుంటోందని, దీనికి సంబంధించిన బిల్లును రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ చెప్పారు. ఒకే సమయంలో ఒకరి కన్నా ఎక్కువ మంది భార్యలను కలిగి ఉంటే బహుభార్యత్వం కిందకు వస్తుంది. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) చర్చ జరుగుతున్న సందర్భంలో అసోం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. బహుభార్యత్వంపై నిషేధం అమలు చేసేందుకు, చట్టపరమైన అంశాలను అన్వేషించడానికి అస్సాం ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ చర్య యూసీసీ అమలుకు దగ్గరగా ఉంది. సెప్టెంబరులో జరగబోయే అసెంబ్లీ సెక్షన్‌లో బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటున్నాం.. కొన్ని కారణాల వల్ల అది కుదరకపోతే జనవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చేస్తాం అని గురువారం సీఎం బిస్వ శర్మ చెప్పారు. ముందుగా బహుభార్యత్వంపై నిషేధం విధించాలని అనుకున్నామని, ఈ లోపు యూసీసీ అమలులోకి వస్తే, ఈ చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని, అది యూసీసీలో విలీనం అవుతుందని సీఎం అన్నారు. బహుభార్యత్వంపై నిషేధం “ఏకాభిప్రాయం ద్వారా సాధించబడుతుంది, దూకుడు ద్వారా కాదు” అని హిమంత బిస్వా శర్మ ఇంతకుముందు చెప్పారు.  https://t.me/offerbazaramzon


Post a Comment

0Comments

Post a Comment (0)