అమెరికాలోని న్యూయార్క్ లో దీపావళి పండుగ రోజున స్కూల్స్ కు సెలవు దినంగా ప్రకటించారు. ఈ మేరకు మేయర్ ఎరిక్ ఆడమ్స్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దీపావళి రోజున పాఠశాలలకు హాలిడే ప్రకటించడం చట్టంలో భాగమైనందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. దీపావళి రోజున స్కూల్స్ కు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సాగిన పోరాటం అసెంబ్లీ మెంబర్ జెనిఫర్ రాజ్ కుమార్, సంఘం నాయకులకు అండగా నిలినందుకు గర్వపడుతున్నానంటూ మేయర్ ఎరిక్ అన్నారు. చాలాకాలంగా అసెంబ్లీ సభ్యులు జెనిఫర్ రాజ్ కుమార్ ఈ సెలవు కోసం డిమాండ్ చేస్తోన్నారు. రెండు దశాబ్ధాలుగా సాగిన తన పోరాటం ఎట్టకేలకు విజయం సాధించినందుకు సంతోకరంగా ఉందని మేయర్ తెలిపారు. ఈ ప్రకటనతో దీపావళి ముందుగానే వచ్చినట్లు అయిందని ఎరిక్ పేర్కొన్నారు.
న్యూయర్స్ లో దీపావళికి పాఠశాలలకు సెలవు
June 27, 2023
0
Tags