భార్యపై అనుమానంతో రాడ్డుతో కొట్టి చంపిన భర్త !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని థానే జిల్లా, బద్లాపూర్ ప్రాంతం లోని మంజర్లిలో కుటుంబ కలహాల కారణంగా 42 ఏళ్ల వ్యక్తి తన భార్యను హత్య చేశాడని, ఆ తర్వాత ఆ వ్యక్తిని అరెస్టు చేశామని  పోలీసులు తెలిపారు. నిందితుడికి, అతని 37 ఏళ్ల భార్య కు కుటుంబ సమస్యలపై తరచూ గొడవలు జరిగేవని, ఆమె వ్యక్తిత్వాన్ని కూడా అనుమానించాడని అందుకే ఆమెను చంపినట్లు పోలీసులు తెలిపారు. రోజూ గొడవలు జరుగుతున్నా పెద్దగా ఉండేవి కాదని స్థానికులు చెబుతున్నారు. కానీ నిన్న జరిగిన గొడవ ఆమె ప్రాణాలను తీసింది. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో పోలీసులు వారిద్దరిపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు చేశారు. సోమవారం భార్యాభర్తలు మద్యం సేవించి మళ్లీ గొడవ పడ్డారు. అనంతరం నిందితుడు ఆమెను రాడ్డు తో విచక్షణా రహితంగా కొట్, గొంతు నులిమి చంపినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ముంబయి లో నివాసముంటున్న తన భార్య సోదరుడి ఫోన్ చేసి ఆమెను హత్య చేసినట్లు నిందితుడు మెసేజ్ పంపాడు. బాధితురాలి సోదరుడు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలాని కి చేరుకుని ఇంట్లో మహిళ శవమై ఉండటాన్ని గమనించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.. 

Post a Comment

0Comments

Post a Comment (0)