నా కుమారుడు నా తల్లి కోరిక నెరవేర్చాడు !

Telugu Lo Computer
0


పంజాబ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు కుమారుడు కరణ్ సిద్ధూకు పాటియాలకు చెందిన ఇనాయత్ రంథావాను ఇచ్చి వివాహం చేయనున్నారు. కుమారుడు, కాబోయే కోడలు, సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సిద్ధూతో కలిసి వినూత్నంగా గంగానదిలో కనిపించారు. గంగమ్మ ఒడిలో (నీటిలో) కూర్చుని పక్కనే గులాబీ పూల దండలు కనిపిస్తుండగా నిశ్చితార్థం జరిగినట్లుగా ఉన్న ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో సిద్ధూ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయని ఇలా వినూత్నంగా పవిత్ర గంగానది ఒడిలో కూర్చుని ప్రకటించారు సిద్ధూ. మరోపక్క కరణ్ సిద్ధూ తనకు కాబోయే భార్య ఇనాయత్ తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. దుర్గాష్టమి రోజున ఇలా పవిత్ర గంగానది ఒడిలో నిశ్చితార్థం చేసారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఇలా అత్యంత నిరాడంబరంగా వినూత్నంగా నిశ్చితార్థం జరిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సిద్ధూ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ కాబోయే కోడలిని పరిచయం చేశారు.

ఈ సందర్భంగా సిద్ధూ ''నా కుమారుడు తన తల్లి కోరికను నెరవేర్చాడు. పవిత్ర దుర్గా-అష్టమి వ్రత తిథి నాడు గంగామాత ఒడిలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. మా కాబోయే కోడలు ఇనాయత్‌ రంధావా. వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు' అంటూ సిద్ధూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఫోటోల్లో సిద్ధూ, ఆయన సతీమణి నవజ్యోత్ కౌర్ సిద్ధూ, కుమార్తె రబియా సిద్ధూ కూడా ఉన్నారు. పాటియాలాకు చెందిన మనీందర్‌ రంధావా కుమార్తె ఇనాయత్‌. మనీందర్ గతంలో ఆర్మీలో పనిచేశారు. ప్రస్తుతం పంజాబ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ముద్దుల కుమార్తెతో సిద్ధూ కుమారుడి వివాహం జరుగనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)