శ్యామ్ చెల్లెలి బాధ్యత మాది !

Telugu Lo Computer
0


ఇటీవల ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ అనుమానాస్పద స్థితిలో మరణించడం తో ఎన్టీఆర్ అభిమానుల్లో విషాదం నిండిపోయారు. ఇక శ్యామ్ మరణం పై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు చెప్తుండటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుతున్నారు . ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరోసారి తమ మంచి మనసు చాటుకున్నారు. చనిపోయిన శ్యామ్ చెల్లెలి బాధ్యతను తీసుకున్నారు. ఎన్టీఆర్ పేరిట ఫ్యాన్స్ నెలకొలిపిన స్వచ్చంద సంస్థ శ్యామ్ చెల్లెలి పెళ్లి బాధ్యత తమదే అంటూ ముందుకు వచ్చింది. శ్యామ్ చెల్లెలి పెళ్లి దగ్గరుండి జరిపిస్తామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు RAW NTR అనే పేరుతో ఓ స్వచ్చంద సంస్థను నెలకొలిపారు . ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి సహాయం అందించారు. ఇప్పుడు శ్యామ్ చెల్లెలి పెళ్లి బాధ్యతను స్వీకరించారు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. కానీ, శ్యామ్ కుటుంబానికి మేము అండగా నిలుస్తాం..శ్యామ్ చెల్లెలి పెళ్లి బాధ్యత మేము తీసుకున్నాం అని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)