కాఫీ ప్రియులకు హెచ్చరిక !

Telugu Lo Computer
0


కాఫీలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. కానీ, ఒక లిమిట్ వరకు కాఫీ తాగడం ఒకే. మోతాదుకు మించితే ఆరోగ్యానికి ముప్పే. కాఫీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే హాని కలుగుతుంది. ఎక్కువ కాఫీ గుండెకు మంచిది కాదంటున్నారు. కాఫీలో అధిక మొత్తంలో కెఫీన్ అనే విష పదార్ధం ఉంటుంది. దీని కారణంగా ఇది త్వరగా రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మనం కాఫీ తాగడం వల్ల రిఫ్రెష్‌గా ఉంటుంది. మగత, అలసట మాయమవుతాయి. దీనివల్ల చురుకుదనం పెరుగుతుంది, కానీ, కాఫీ ఎక్కువగా తాగితే కెఫీన్ వల్ల సరైన సమయానికి నిద్రపట్టదు. నిద్రపోయే విధానం పూర్తిగా మారిపోతుంది.  రోజుకు 5 లేదా 6 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల డిమెన్షియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది రోగి అసాధారణంగా ప్రవర్తించే మానసిక అనారోగ్యం. ఇది అధిక రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం వంటి వ్యాధులకు దారి తీస్తుంది. కాఫీ తాగడం వల్ల మన పొట్టపై చెడు ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇది గ్యాస్ట్రిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది ప్రేగు కార్యకలాపాలను పెంచుతుంది. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)