అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వేసిన పరువు నష్టం కేసులో అమెరికా శృంగార తార స్టార్మీ డేనియల్స్‌కు చుక్కెదురైంది. ఆరోపణలు రుజువు చేయడంలో విఫలమైనందుకు ట్రంప్ న్యాయవాదులకు సుమారు ఒక కోటి రూపాయలు చెల్లించాలని 9వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఆదేశించింది. మరోవైపు తనపై దాఖలైన 34 నేరాభియోగాల్లో తాను దోషిని కాదని ట్రంప్ కోర్టుకు తెలిపారు. డేనియల్స్‌తో సంబంధం బయటపడకుండా ఉండేందుకు ఆమెతో అనైతిక ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణల కేసులో ట్రంప్ మంగళవారం మన్‌హటన్ కోర్టు విచారణకు హాజరయ్యారు. అంతకుముందు, లొంగిపోయేందుకు ట్రంప్ కోర్టు హాలుకు రాగా, పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. విచారణ అనంతరం ట్రంప్ కోర్టు నుంచి వెళ్లిపోయారు.
ట్రంప్‌కు కోటి రూపాయలు చెల్లించండి !
April 06, 2023
0
Tags