మద్యం మత్తులో ఇంటి యజమానిని చంపిన టెక్కీలు !

Telugu Lo Computer
0


బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజ్ఞాన్ నగర్‌లో లయాడ్ నేమయ్య అలియాస్ నేమయ్య అనే ఆయన అతని కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. నేమయ్య చాలా సంవత్సరాల క్రితమే ఆ ప్రాంతంలో సొంతంగా ఇంటికి కట్టుకున్నారు. నేమయ్య ఓ ఇంటిలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటూ మరికొన్ని అద్దెకు ఇచ్చారు. ఒడిశాకు చెందిన యువకులు బెంగళూరు చేరుకుని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీలుగా ఉద్యోగం చేస్తున్నారు. రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న టెక్కీలు ఇంట్లో హోమ్ థియేటర్ లో మ్యూజిక్ సౌండ్ ఎక్కువగా పెట్టుకుని, డీజే పాటలతో లేనిపోని రాద్దాంతం చేస్తున్నారు. ఇంతకు ముందే చాలాసార్లు మీరు సౌండ్ తక్కువగా పెట్టుకోవాలని, మా ఇంట్లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పెద్దలు ఉన్నారని నేమయ్య ఒడిశా టెక్కీలకు చెప్పాడు. మర్యాదగా సౌండ్ తగ్గించాలని నేమయ్య టెక్కీలను హెచ్చరించాడు. కొంత సేపటి తరువాత పీకలదాక మద్యం సేవించిన టెక్కీలు బయటకు వెళ్లి నేమయ్యను ఇంటి నుంచి బయటకు లాగి చితకబాదేశారు. టెక్కీల దాడిలో నేమయ్యకు తీవ్రగాయాలై కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు నేమయ్యను ఆసుపత్రికి తరలించారు. నేమయ్య కుటుంబ సభ్యులు టెక్కీల మీద హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేమయ్య ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, దాడి కేసును హత్య కేసుగా మార్చిన హెచ్ఏఎల్ పోలీసులు ఓ ఇంటికి ఆసరాగా ఉన్న ఆ ఇంటి యజమానిని మద్యం మత్తులో హత్య చేశారని కేసు నమోదు చేసి టెక్కీల మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)