ఆఫ్రికా దేశమైన సూడాన్ మరోసారి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశ ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఆ నేపథ్యంలో ఇరు వర్గాలు బాంబుల దాడులు, కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై సూడన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ భారతీయలను హెచ్చరించింది. ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో ఎవ్వరూ బయటకు రావద్దని హెచ్చరించింది. అయితే నిన్న జరిగిన కాల్పుల్లో దాల్ గ్రూప్ లో పనిచేస్తున్న అల్బర్ట్ ఆగస్టీన్ అనే భారతీయుడు చనిపోయినట్లు తెలిపింది. తదుపరి ఏర్పాట్లు చేయడానికి అతని కుటుంబ సభ్యులు, వైద్య అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా సూడాన్‌లోని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాన్ని సైన్యంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అయితే దీనిపై సైన్యాధినేత అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, పారామిలిటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో మధ్య కొన్ని వారాలుగా విభేదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం.. విభేదాలు తీవ్రతరం అవ్వడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో, సూడాన్ రాజధాని ఖార్టూమ్ సహా పలు ప్రాంతాల్లో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 56 మంది చనిపోయారు. మరోవైపు సూడాన్ అధ్యక్ష భవనం, బుర్హాన్ నివాసం, ఖార్టూమ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం.
సుడాన్ లో ఆర్మీ, పారా మిలటరీల మధ్య ఘర్షణలు
April 16, 2023
0
Tags