ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన గణపతి అదే మండలంలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా బాధ్యతలు తీసుకున్నారు. 1998లో డీఎస్సీ అభ్యర్థులు ఎప్పటి నుంచో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం వీరికి పోస్టింగ్ కేటాయించింది. అందులో జబర్దస్త్ గణపతి కూడా ఉన్నారు. జబర్దస్త్ రెగ్యులర్‌గా చూసేవారికి గణపతి అంటే తెలియని వారుండరు. హైపర్ ఆది టీమ్‌లో చాలా బొద్దుగా ఉంటూ కామెడీ పంచులతో తెగ నవ్వించారాయన. చాలా స్కిట్లలో ఆదికి భార్యగా లేడీ గెటప్‌లలో కూడా అలరించారు. పలు చిత్రాలల్లో కూడా కమెడియన్‌గా నటించి మెప్పించారాయన. అయితే ఆది జబర్దస్త్ షో మానేశాక గణపతి తాజాగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారట. సర్కార్ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పాలన్నది కల ఈనాటిది కాదట. అతని 25 ఏళ్ల కలనట ! . జబర్దస్త్ కు రాకముందు కూడా కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్‌గా పనిచేశారట. ఆ తర్వాతే హైదరాబాద్ కు వచ్చి కమెడియన్‌గా స్థిరపడ్డారు. మొత్తానికి కామెడీ పంచులు, ప్రాసలతో నవ్వించిన గణపతి ఇప్పుడు పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పేందుకు రెడీ అయ్యారు. ఈ విషయం తెలిసి పలువురు నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.
గవర్నమెంట్ టీచర్‌గా జబర్దస్త్ కమెడియన్ గణపతి !
April 16, 2023
0
Tags