రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు !

Telugu Lo Computer
0


అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని ఓ విశ్రాంత మెకానిక్‌ ఎర్ల్ లాపే (61) అనే వ్యక్తికి లాటరీ టికెట్ తగలడంతో ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయారు. ఏప్రిల్ ఫూల్స్ డే రోజున తాను లొట్టో అమెరికా టికెట్ కొన్నాడు. అయితే ఆ టికెట్‌కు బహుమతి వచ్చిందన్న విషయం తెలియగానే అది ఏప్రిల్ ఫూల్ జోక్ అనుకుని నవ్వేశానన్నారు. కానీ నిజంగానే వచ్చినట్లు స్పష్టత రావడంతో షాక్ అయ్యారు. ఎర్ల్ లాపే బహుమతి మొత్తాన్ని ఒకేసారి తీసుకునే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకున్నారు. దీంతో ఆయనకు 21.28 మిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.174 కోట్లు వచ్చాయి. అలాకాకుండా ఒకవేళ ఏడాదికి కొంతమొత్తం చొప్పున తీసుకుంటే 29 సంవత్సరాల్లో 40 మిలియన్‌ డాలర్లూ లభించేవి. తనకు వచ్చిన సొమ్మును కుటుంబ అవసరాలకు ఖర్చు చేయడంతోపాటు, ఆరోగ్య సమస్యలతో బాధపడే చిన్నారులను ఆదుకుంటానని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)