ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలో 2021, మే 8వ తేదీన కమలా దేవి అనే మహిళ మరణించగా ఆమె బంధువులు చేసిన పని తాజాగా ఓ వీడియో ద్వారా నెట్‌లో వైరల్ అవుతోంది. దీంతో ఆ బంధువు శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు వీడియోపై దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో పాకిస్తాన్‌లోది అంటూ ప్రచారం జరిగినా చివరకు మన దేశంలోనిదేనని ఆగ్రా పోలీసులు ధృవీకరించారు. వయసు పైబడి కమలా దేవి కన్నుమూసింది. ఆమె భర్త అంతకు ముందు కొన్నేళ్ల కిందటే చనిపోగా వాళ్లకు సంతానం లేదని తెలుస్తోంది. పిల్లలు లేకపోవడంతో బంధువుల పిల్లలను ఆ దంపతులు ఆప్యాయంగా చూసుకునేవాళ్లు. ఈ క్రమంలో వాళ్ల ఆస్తి మీద ఆ బంధువులకు దుర్బుద్ధి పుట్టినట్లుంది. ఆమె బావ కొడుకులు ఆమె మృతదేహన్ని శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. కాస్త దూరం వెళ్లాక, ఆమె మృతదేహాన్ని కారు నుంచి బయటకు లాగి, ఓ లాయర్ సమక్షంలో వీలునామా కాగితాల మీద ఆమె వేలిముద్రలు తీసుకున్నారు. ఆమె పేరిట ఉన్న ఓ పెద్ద దుకాణం, ఇంటిని తమ పేరిట మార్చేసేందుకు అలా డాక్యుమెంటరీని ఫోర్జరీ చేసే యత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె దూరపు బంధువైన ఓ వ్యక్తికి, ఆ వేలిముద్ర పై అనుమానం కలిగింది. ఎందుకంటే ఆమె చదువుకుంది, సంతకం చేయగలదు కాబట్టి. అయితే ఆధారాలు లేకపోవడంతో నిర్ధారించుకోలేకపోయాడు. కానీ, ఆయన అనుమానం నిజమేనే విషయం ఇప్పుడు బయటపడింది. ఆస్తుల పంపకాల్లో తేడాలు రావడంతో వాళ్లలో ఒకరు ఆ వీడియో బయటపెట్టాడు.
బంధువులే రాబంధువులైన వేళ !
April 12, 2023
0
Tags