అమెరికాలోని న్యూజెర్సీ, సెకాసస్ ప్రాంతంలో అలాఫ్ట్ హోటల్‌లో జరిగిన ఘటనలో వినీత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అలోఫ్ట్ హోటల్‌లో ఓ సెక్స్‌వర్కర్‌తో వినీత్ రావూరి బస చేశాడు. అయితే డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తానిచ్చిన డబ్బులు వెంటనే రిటర్న్ చేయాలని సెక్స్ వర్కర్‌ను అడిగాడు వినీత్. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడి చేశాడు. రూమ్ నుంచి తప్పించుకొని బయటకు వచ్చిన మహిళ హోటల్ లోని లాంజ్‌లో కుప్పకూలింది. హెటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వినీత్ రావూరిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంతో కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తునట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై సాయుధ దోపిడీ [2C:15-1a(1)], తీవ్ర దాడి [2C:12- 1b(1)], క్రిమినల్ నియంత్రణ [2C:13-2], చట్టవిరుద్ధమైన ప్రయోజనం కోసం ఆయుధాన్ని కలిగి ఉండటం [2C :39- 4(d)], చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉండటం [2C:39-5(d)], వ్యభిచారంలో పాల్గొనడం [2C:34- 1b(1)] వంటి అమెరికన్ సెక్షన్లతో కేసు ఫైల్ చేశారు. వినీత్‌ను హడ్సన్ కౌంటీ జైలులో ఉంచారు.
న్యూజెర్సీలో అరెస్టైన తెలుగు విద్యార్థి
April 12, 2023
0
Tags