వేడి నీరు - అనర్థాలు !

Telugu Lo Computer
0


చలికాలంలో వేడి నీటిని తాగడం వల్ల గొంతు, ముక్కు, ఛాతీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే మితిమీరిన వేడి నీటిని అతిగా తాగడం ఆరోగ్యానికి హానీ తలపెడుతుంది. ఓ మెడికల్ సర్వే ప్రకారం అతిగా వేడి నీరు తాగడం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. ఎక్కువగా వేడి నీటిని తీసుకుంటే చర్మ కణజాలానికి హాని జరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల చర్మం అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. 60 ఏళ్ల వృద్ధుడు వేడి నీటిని తాగడం వల్ల శ్వాస వ్యవస్థలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీటిని వేడి చేయడం వలన అందులో లోహ కణాలు కలుస్తాయి. ఈ కణాలు వేడి నీటిలో త్వరగా కరిగిపోతాయి. అల్యూమినియం పాత్రలు, ఇతర పాత్రల్లో వేడి చేయడం వల్ల ఆ కణాలు నీటిలో కరిగి, శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే నీటిని ఎప్పుడూ ఉక్కు పాత్రలో వేడి చేసి తాగాలని నిపుణులు చెబుతున్నారు. బాగా వేడిగా ఉన్న నీటిని తాగొద్దు. దీని వల్ల గొంతు దెబ్బతింటుంది. నాలుక కాలే ప్రమాదం ఉంది. వేడి నీళ్లలో చల్లటి నీళ్లు కూడా కలిపి తాగొద్దు. దీని వల్ల కూడా నష్టాలు ఉంటాయి. అందుకే ఒకే రకమైన నీటిని తాగాలి. నీటిని ఎక్కువగా మరిగిస్తే.. అవి గోరువెచ్చగా మారే వరకు వేచి చూడాలి. గోరు వెచ్చగా ఉన్న నీటినే తాగాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)