పశ్చిమ బెంగాల్ లో మరో ఎంబీబీఎస్ విద్యార్థిని అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాకు చెందిన బాధితురాలు శోభాపూర్ కాలేజీలో చదువుతోంది. నిన్న తన మిత్రుడితో కలిసి రాత్రి 8 గంటలకు భోజనం చేసేందుకు బయటకు వెళ్తుండగా క్యాంపస్ గేటు వద్ద ఓ వ్యక్తి పక్కకు లాక్కెళ్లి రేప్ చేశాడు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. రెండవ సంవత్సరం చదువుతున్న బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం ఆమె ఒక స్నేహితుడి కోరిక మేరకు భోజనం చేసేందుకు క్యాంపస్ బయటకు వెళ్లింది. ఆ సమయంలో కొందరు వ్యక్తులు వారిని అడ్డగించారు. ఆమె స్నేహితుడు అక్కడి నుంచి పారిపోగా, గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా ఆమెను సమీపంలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ వారిలో ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలి ఫోన్ కూడా లాక్కెళ్లారు.
పశ్చిమ బెంగాల్ లో మరో ఎంబీబీఎస్ విద్యార్థిని అత్యాచారం !
October 11, 2025
0
Tags