హైదరాబాద్ లోని ఐసీసీలో ఏఐ హబ్ టీ స్క్వేర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రి శ్రీధర్‌బాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టీజేఐఐసీ ఎండీ శశాంక, టీ ఫైబర్ ండీ వేణు ప్రసాద్, ఐటీ శాఖ డిప్యూటి సెక్రటరీ భవేష్ మిశ్రా , ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 'టీ స్క్వేర్ నిర్మాణం లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, టీ స్క్వేర్ లో ఆపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ ఔట్లెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టీ స్క్వేర్ 24 గంటల పాటు పని చేయాలి. ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్‌లో భవనాలను పరిశీలించాలి. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. ఏఐ హబ్‌లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఏఐ హబ్ టీ స్క్వేర్‌పై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
October 11, 2025
0
Tags