కంపాస్ ట్రాక్ ఎడిషన్ ను లాంచ్ చేసిన జీప్ ఇండియా !

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో జీప్ ఇండియా తాజాగా  కంపాస్ ట్రాక్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఇది లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ కాగా, సాధారణ కంపాస్ మోడల్‌తో పోలిస్తే కొన్ని ప్రత్యేక అప్‌గ్రేడ్స్‌ తో వస్తోంది. ఈ కొత్త ఎడిషన్ కంపాస్ మోడల్ S ఆధారంగా రూపొందించబడింది. ట్రాక్ ఎడిషన్ లో సిగ్నేచర్ హుడ్ డికల్, పియానో బ్లాక్ గ్రిల్ డీటైల్స్, బ్యాడ్జ్‌లపై స్పెషల్ ఫినిషింగ్ వంటి స్టైలిష్ మార్పులు ఉన్నాయి. ఇక SUV ప్రత్యేకతను చూపించేందుకు "Track Edition" బ్యాడ్జ్ ను కూడా జోడించారు. అలాగే, 18 అంగుళాల డైమండ్ కట్ టెక్ గ్రే అల్లాయ్ వీల్స్ ఇవ్వబడ్డాయి. క్యాబిన్ లో కూడా కొత్తదనం కనిపిస్తుంది. టుపెలో లేథెరెట్టే సీట్స్, స్మోక్ క్రోమ్ ఫినిష్‌లు, స్ప్రూస్ బీజ్ స్టిచింగ్, ఎంబాస్‌డ్ జీప్ బ్రాండింగ్ తో ఇంటీరియర్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్, పియానో బ్లాక్ ఇన్సర్ట్స్, ట్రాక్ ఎడిషన్ ఫ్లోర్ మ్యాట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఇన్ఫోటైన్‌మెంట్ సెక్షన్‌లో 10.1 అంగుళాల Uconnect టచ్‌స్క్రీన్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వైర్‌లెస్ కనెక్టివిటీతో వస్తుంది. వీటితోపాటు 10.25 అంగుళాల డిజిటల్ గేజ్ క్లస్టర్, ఆల్పైన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. కంఫర్ట్ కోసం 8-వే ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ వెంటిలేటెడ్ సీట్స్ (మెమరీ ఫంక్షన్‌తో), అలాగే డ్యూయల్-పేన్ పానొరామిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. సుదీర ప్రయాణాల్లో ఆహ్లాదకరమైన అనుభూతిని ఇవి అందిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)