ఛత్తీస్‌గఢ్ లో 'బస్తర్ దసరా లోకోత్సవ్' కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయి. బస్తర్ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి నక్సలిజమే. బస్తర్ శాంతికి భంగం కలిగిస్తే భద్రతా బలగాలు తగిన రీతిలో సమాధానం చెబుతాయంటూ అమిత్ షా హెచ్చరించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి రూ. 4 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. మావోయిజం వల్ల తప్పుదారి పట్టినవారు హింసను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలంటూ అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామని, లొంగిపోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామంటూ అమిత్ షా పేర్కొన్నారు.
మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా
October 04, 2025
0
Tags