తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

Telugu Lo Computer
0


తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సెప్టెంబర్ 29న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 6న పిటిషన్ పై విచారణ చేయనుంది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబర్ 6 న ఏం జరుగబోతోంది అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ ను అధికారులు ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణలో ఈ ఎన్నికలను మొత్తం 5 దశల్లో నిర్వహించనున్నారు అధికారులు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ విక్రమ్‌ నాథ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 6న విచారణ చేపట్టనుంది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీంతో ప్రభుత్వం విడుదల చేసిన జీవో చెల్లదని చర్చ జరుగుతోంది. దీంతో ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అన్న ఆందోళన ఆశావహుల్లో వ్యక్తం అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)