మహారాష్ట్రలోని పూణే, చార్హోలి హౌసింగ్ సొసైటీలో శనివారం సాయంత్రం 5 గంటలకు అమీ ఫడ్తారే అనే 12 ఏళ్ల బాలుడు లిఫ్ట్‌లో చిక్కుకుని మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఆ బాలుడు లిఫ్ట్‌లో పై అంతస్తుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో లిఫ్ట్ షాఫ్ట్‌లో చిక్కుకున్న బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. అగ్నిమాపక శాఖకు ఈ విషయంపై కాల్ రావడంతో, బృందం తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుంది. వారు లిఫ్ట్ కంట్రోల్ రూమ్ డోర్‌ను పగలగొట్టి, లిఫ్ట్‌ను కిందికి దించి చిక్కుకున్న బాలుడిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతడిని మృతి చెందినట్లు ప్రకటించారు. బాలుడు లిఫ్ట్ దగ్గర సైకిల్‌తో ఆడుకుంటున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. లిఫ్ట్ డోర్ తెరుచుకున్నప్పటికీ, క్యాబిన్ కిందికి జారిపోవడంతో అతను మూడవ, నాల్గవ అంతస్తుల మధ్య చిక్కుకున్నాడు. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం, లిఫ్ట్ సెన్సార్ పని చేయకపోవడం లేదా మెయింటెనెన్స్ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ భవనం 2014లో నిర్మించబడింది, అంటే లిఫ్ట్ దాదాపు 11 సంవత్సరాల పాతది. సరైన సర్వీస్ లేకపోవడం ఈ విషాదానికి కారణమని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు.
లిఫ్ట్‌లో చిక్కుకుని 12 ఏళ్ల బాలుడు మృతి
October 05, 2025
0
Tags