నిలబడి నీరు తాగడం వల్ల మోకాళ్లు దెబ్బతింటాయి లేదా ఇతర కీళ్లపై ప్రభావం చూపుతుందనే ఆలోచన ఒక అపోహ మాత్రమే. నిలబడి తాగేటప్పుడు నీరు అన్నవాహిక ద్వారా నేరుగా కడుపులోకి వేగంగా వెళుతుంది. దీనికి మోకాళ్లపై ప్రత్యక్ష సంబంధం లేదు. కొంతమంది తొందరపడి నిలబడి నీరు త్రాగినప్పుడు అజీర్ణం లేదా అసౌకర్యానికి గురికావచ్చని ప్రముఖ డైటీషియన్ జుహి అరోరా తన సోషల్ మీడియాలో తెలియజేశారు. నిలబడి నీరు తాగడం వల్ల మోకాళ్లకు నేరుగా హాని కలగకపోయినా, ఇది జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలపై ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయుర్వేదం, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిలబడి నీరు త్రాగితే, నీరు అన్నవాహిక ద్వారా వేగంగా కడుపులోకి వెళుతుంది. ఈ వేగం జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల అజీర్ణం లేదా గ్యాస్ సమస్యలు రావొచ్చు. అలా తాగినప్పుడు అది సిరలపై ఒత్తిడి తెస్తుంది. కాలక్రమేణా కీళ్లలో ద్రవం పేరుకుపోవడం లేదా ద్రవ సమతుల్యత దెబ్బతినడం వల్ల భవిష్యత్తులో కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నిలబడి నీరు త్రాగితే అది ఫిల్టర్ కాకుండా వేగంగా కడుపులోకి వెళ్లిపోతుంది. దీనివల్ల నీటిలోని మలినాలు మూత్రాశయంలో పేరుకుపోతాయి. ఇది మూత్రపిండాల పనితీరును దెబ్బతీసి మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అలా నీరు త్రాగినప్పుడు, అవసరమైన పోషకాలు, విటమిన్లు కాలేయం, జీర్ణవ్యవస్థ ద్వారా సరిగ్గా గ్రహించుకోవు. శరీరంలోని ద్రవ సమతుల్యత దెబ్బతింటుందని, నరాలలో ఉద్రిక్తత ఏర్పడుతుందని కూడా చెబుతారు. ఆయుర్వేదం ప్రకారం నీటిని ఎల్లప్పుడూ కూర్చున్నప్పుడు, హాయిగా, చిన్న సిప్స్‌లో, నెమ్మదిగా త్రాగాలి. తొందరపడి నిలబడి లేదా నడుస్తున్నప్పుడు నీరు త్రాగకూడదు. రోజుకు కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీరు తాగడం మంచిది.
నిలబడి నీళ్లు తాగితే మంచిదేనా ?
October 13, 2025
0
Tags