1993లో మద్రాస్ రబ్బరు ఫ్యాక్టరీ (ఎంఆర్ఎఫ్) షేర్లలో పెట్టుబడి పెట్టిన ఓ వ్యక్తి ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు. ఎంఆర్ఎఫ్ షేరుకు రూ.10 ఫేస్ వాల్యూతో 1993లో పబ్లిక్ లిస్టింగ్ అయింది. గత 25 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు 7,40,109 శాతానికి పైగా రాబడిని అందించింది. ఏప్రిల్ 27, 1993న, కంపెనీ షేరు బీఎస్ఈలో రూ.11 వద్ద ముగిసింది. ఇక ఇప్పుడు గత ట్రేడింగ్ సెషన్‌లో ఈ కంపెనీ షేర్ రూ.1,55,510 వద్ద ముగిసింది. ఎంఆర్ఎఫ్ షేర్లు గత కొన్ని సంవత్సరాలుగా పెట్టుబడిదారులకు భారీగా రాబడిని అందిస్తున్నాయి. లిస్టింగ్ సమయంలో ఓ వ్యక్తి చేతిలో 1000 షేర్లు అనగా అప్పటి రేటుతో రూ. 11 వేలు ఖర్చు పెట్టి తీసుకుంటే ఆ పెట్టుబడి ఇప్పుడు అక్షరాలా రూ. 15,50,00,000గా అవుతుంది. బీఎస్ఈడేటా ప్రకారం ఎంఆర్ఎఫ్ షేర్లు ఆల్ టైంలో 8 వేలకుపైగా శాతం రాబడిని, గడిచిన ఐదు సంవత్సరాలలో 168.06 శాతం రాబడిని అందించాయి. అలాగే గత ఒక సంవత్సరంలో 17.89 శాతం రాబడిని ఇవ్వడమే కాదు.. ఆరు నెలల్లోనూ పెట్టుబడిదారులకు 26.53 శాతం రాబడి అందించాయి. దీని బట్టి చూస్తే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు షార్ట్ టర్మ్‌కు కాకుండా లాంగ్ టర్మ్‌కు చూసుకుంటే మంచిదని బిజినెస్ అనలిస్టులు అంటున్నారు. ఈ కంపెనీని 1946లో మద్రాసులోని తిరువొట్టియూర్‌లో కె.ఎం. మమ్మెన్ మాప్పిళ్లై బొమ్మ బెలూన్ తయారీ యూనిట్‌గా ప్రారంభించారు. 1952లో ఈ కంపెనీ ట్రెడ్ రబ్బరు తయారీలోకి అడుగుపెట్టింది. మద్రాస్ రబ్బరు ఫ్యాక్టరీ లిమిటెడ్ నవంబర్ 1960లో ఒక ప్రైవేట్ కంపెనీగా స్థాపించబడింది. అమెరికా లోని మాన్స్‌ఫీల్డ్ టైర్ & రబ్బరు కంపెనీతో భాగస్వామ్యంతో టైర్ల తయారీలోకి అడుగుపెట్టింది. 1967లో ఇది అమెరికాకు టైర్లను ఎగుమతి చేసిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. నేడు, ఈ కంపెనీ టైర్లు, ట్రెడ్‌లు, ట్యూబ్‌లు, కన్వేయర్ బెల్టులు, క్రికెట్ బ్యాట్‌లు వంటి రబ్బరు ఉత్పత్తులను తయారు చేస్తుంది.
1993లో ఎంఆర్ఎఫ్ 1000 షేర్లు రూ. 11 వేలు - ఇప్పుడు రూ. 15 కోట్లు !
October 13, 2025
0
Tags