అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయం ప్రారంభం

Telugu Lo Computer
0


మరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయాన్ని నేడు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉండటంతో బహిరంగ సమావేశం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ప్రభుత్వం గ్రాఫిక్స్ డిజైన్లను నేడు కార్యరూపంలోకి తీసుకువచ్చింది. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా బిల్డింగ్ బయట A అక్షరంతో ఎలివేషన్ ఇచ్చారు. ఇదే ఈ బిల్డింగ్ కి ప్రధాన ఆకర్షణ. అమరావతి నిర్మాణ పనులను ఇకనుంచి ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ E3-N11 జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలో ఏపీ మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ఇక్కడ ఒక ప్రధాన భవనంతో పాటు PEB భవనాలు నిర్మించారు. 4.32 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 7((G+7) భవనం 3 లక్షల 7వేల 326 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రధాన భవనం 0.73 ఎకరాలు, గ్రీన్ జోన్ 0.88 ఎకరాలు, ఓపెన్ స్పేస్ 0.96 ఎకరాలు, పార్కింగ్ ప్రాంతం 1.36 ఎకరాలు, ఎస్టీపీ 0.39 ఎకరాల్లో నిర్మాణం చేశారు. ఇవి కాకుండా హెడ్ రూమ్స్ 5,554,చ.అ, ప్రొజెక్షన్ శ్లాబ్స్ 3,113చ.అ.,టెర్రస్ PEB స్ట్రక్చర్ 32,062 చ.అడుగులు కలిపి మొత్తం 2,85,561 చ.అడుగుల విస్తీర్ణంలో(బిల్టప్ ఏరియా)లో ఈ బిల్డింగ్ నిర్మించారు . ఆఫీస్ ప్రాంగణంలో సంపు, పంప్ రూం 4,029చ.అడుగులు, 5014 చ.అ., డ్రైవర్స్ లాంజ్ 752 సెక్యూరిటీ రూం 225, యుటిలిటీ బ్లాక్ 11,745 చ దరపు అడుగులతో కలిపి మొత్తం ఎక్స్టర్నల్ బ్లాక్ 21,765 చ.అడుగులు ఉన్నాయి. ఇంటర్నల్ బ్లాక్, ఎక్స్ టర్నల్ బ్లాక్ ఏరియా కలిపి మొత్తం 3,07,326 చదరపు అడుగుల్లో నిర్మాణం జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)