ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు వీలుగా ఎక్సైజ్ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బార్లు, దుకాణాల్లో నాణ్యమైన మద్యం మాత్రమే అమ్మాలని సూచించింది. ఎక్సైజ్ శాఖ సురక్షా యాప్ తో మద్యం బాటిళ్లపై కోడ్ స్కాన్ చేయాలని ఆదేశించింది. అమ్ముతున్నది నాణ్యమైన మద్యమేనని నిర్ధారించినట్లు షాపులు, బార్ల దగ్గర బోర్డులు పెట్టాలని ఆదేశించింది. అలాగే మద్యం బాటిళ్లపై సీల్, క్యాప్, హోలోగ్రామ్ చెక్ చేయాలని సూచించింది. రాష్ట్రంలోని ప్రతీ మద్యం దుకాణం, బార్ లో డైలీ మద్యం రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించింది. ఎక్సైజ్ సిబ్బంది మద్యం దుకాణాల్లో విస్తృత తనిఖీలు చేయాలని, ఇలా చేసిన తనిఖీల వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించింది. మద్యం డిపోల నుంచి అందిన మద్యం సీసాల్లో కనీసం 5 శాతం బాటిల్స్ స్కాన్ చేయాలని కోరింది. ఎక్కడైనా నకిలీ మద్యం గుర్తిస్తే వెంటనే ఎక్సైజ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని సూచించింది. అలాగే నకిలీ మద్యం దొరికితే సదరు షాపు లేదా బార్ లైసెన్స్ రద్దు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో పాటు నకిలీ మద్యంపై ఫిర్యాదులకు పర్యవేక్షణ ఉండేలా ఓ వ్యవస్థ అందుబాటులోకి తేవాలని కోరింది. వీటిలో వచ్చే ఫిర్యాదుల్ని 24 గంటల్లో విచారించి పరిష్కరించాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ షాపులు, బార్లకు కొత్త రూల్స్ !
October 15, 2025
0
Tags