జాగృతి జనంబాట పోస్టర్ ను ఆవిష్కరించిన కవిత

Telugu Lo Computer
0


తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయాలని కవిత నిర్ణయించారు. ఈ మేరకు జాగృతి జనంబాట పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు నాలుగు నెలల పాటు 33 జిల్లాల్లో యాత్ర నిర్వహించనున్నారు. అయితే ఈ యాత్రలో కేసీఆర్ ఫోటోను పెట్టుకోవటం లేదని కవిత స్పష్టం చేశారు. జాగృతి కార్యక్రమాల్లో కేసీఆర్ ఫోటోను పెట్టుకున్నాం కానీ ఇప్పుడు తాను ఆ పార్టీలో లేను కాబట్టి, అందుకే తన తరఫున క్లారిటీ ఇస్తున్నానని తెలిపారు. - చెట్టు పేరు చెప్పుకొని బతికే ఉద్దేశం తనకు లేదన్నారు కవిత.  ఆ చెట్టు నీడ లో ఉన్నంత వరకు దుర్మార్గుల బారి నుంచి చెట్టును కాపాడేందుకు ఎంతో ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చారు. తాను నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసే వరకు జాగృతిలో కేసీఆర్ ఫోటో పెట్టలేదన్నారు. తన దారిలో తాను వెళ్తుండగా కేసీఆర్ ఫోటో పెట్టుకోవటం నైతికంగా సరికాదన్నారు. అక్టోబర్ 25 నుంచి నిజామాబాద్ నుంచి జాగృతి జనం బాట ప్రారంభం కానుందని వెల్లడించారు. తాను జనం ఏం చెబుతారో వినాలనే జనం బాట కార్యక్రమం చేపడుతున్నానని కవిత చెప్పుకొచ్చారు. ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్లు చెప్పే మాటలు వినాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. తెలంగాణ వస్తే ఏం కావాలని ప్రజలు కోరుకున్నారో, ఏం జరిగిందో, ఏం జరగాలని కోరుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా అని కవిత తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో కవిత యాత్రను చేయనున్నారని, బీసీ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఈ యాత్రకు ప్లాన్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు చిన్న విషయం అన్న కవిత.. తెలంగాణ అనేదే పెద్ద అంశమని కవిత చెప్పుకొచ్చారు. పార్టీ తనను సస్పెండ్ చేశాక ఎమ్మెల్సీ పదవి పైన తనకు వ్యామోహం పోయిందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)