జియో హాట్‌స్టార్ ఓటీటీ డౌన్ : వినియోగదారుల ఫిర్యాదుల వెల్లువ

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా జియో హాట్ స్టార్ ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫాం గురువారం ఉదయం నుంచి పనిచేయడం మానేసింది. వినియోగదారులు మూవీలు, టీవీ షోలు, లైవ్ స్పోర్ట్స్ లు  స్ట్రీమ్ చేయడంలో సమస్యలు, లాగిన్ ఫెయిల్యూర్లు, యాప్ క్రాష్లు, బఫరింగ్ వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. లక్షల మంది జియో హాట్ స్టార్ డౌన్ అయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ సమస్యలు ఉదయం 9 గంటలకు ముందు ప్రారంభమైనట్లు వినియోగదారులు తెలిపారు. Xలో వేలాది పోస్టులు "వీడియోలు లోడ్ కావట్లేదు, సర్వర్ ఎర్రర్ చూపిస్తోంది" అని, "సెర్చ్ ఆప్షన్ పని చేయట్లేదు, ప్రొఫైల్ కూడా కనిపించట్లేదు" అని ఫిర్యాదు చేశారు. "జియో హాట్స్టార్ యాప్లో వీడియోలు లోడ్ కావట్లేదు లేదా సర్వర్ ఎర్రర్లు చూపిస్తున్నాయి. తాత్కాలిక ఔటేజ్ గా కనిపిస్తోంది" అని కొంత మందిపేర్కొన్నారు. వీడియోలు ప్లే అవ్వకపోవటం, బఫరింగ్, లేదా "అన్ఎబుల్ టు కనెక్ట్ టు జియో హాట్ స్టార్" అనే మెసేజ్ చూపడం వంటి సమస్యలు సాధారణంగా మారాయి. సెర్చ్ ఆప్షన్ పని చేయకపోవటం, సెట్టింగ్స్ ఆప్షన్ కనిపించకపోవటం, ప్రొఫైల్ లేదా సబ్స్క్రిప్షన్ ప్లాన్ చూడలేకపోవటం వంటివి ఎక్కువ మంది వినియోగదారులు ఫేస్ చేశారు. లాగిన్ ఫెయిల్యూర్లు, అకౌంట్ లోడ్ కాకపోవటం వంటివి ఎక్కుగా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. బిగ్ బాస్, క్రికెట్ మ్యాచ్లు వంటి లైవ్ కంటెంట్ చూడాలనుకునే వారు నిరాశకు గురయ్యారు. డౌన్డిటెక్టర్ వంటి సైట్ల ప్రకారం, జియో నెట్వర్క్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కానీ ప్రధాన సమస్య జియో హాట్ స్టార్ యాప్ కు సంబంధించినది. "కొన్ని నిరోధించలేకపోయిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది వినియోగదారులు స్ట్రీమింగ్ లేదా ప్లాట్ ఫాం యాక్సెస్ లో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించడానికి మేము పని చేస్తున్నాం. అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాం" అని జియో హాట్ స్టార్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ @hotstar_helps నుంచి వచ్చిన వివరణలో పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)