స్కూటీని ఢీకొన్న టిప్పర్ : నలుగురు దుర్మరణం

Telugu Lo Computer
0


తెలంగాణలోని కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని చత్రపతి శివాజీ స్టాచ్యూ నుంచి కామారెడ్డి వైపు రాంగ్ రూట్లో వెళుతున్న మొరం టిప్పర్ భిక్కనూరు వైపు వస్తున్న స్కూటీని ఢీకొనడంతో ఆదిలాబాద్‌కు చెందిన కిషన్(54)ర, ఖమ్మంకు చెందిన ఆయన కూతురు జెస్లిన్ (28) స్పాట్ లో డెడ్ అవ్వగా నాలుగు సంవత్సరాల మనవడు, మూడు నెలల వయసు గల చంటి పిల్లాడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే జిఎంఆర్ అంబులెన్స్‌లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో బాలుడు మృతి చెందగా, మూడు నెలల పసి గుడ్డు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. టీకా వేయించేందుకు కామారెడ్డి మండలం శాబ్దిపూర్ నుంచి తెలిసిన సిస్టర్ ఉందన్న ఉద్దేశంతో జంగంపల్లి పల్లె దవాఖానకు ఎలక్ట్రిక్ స్కూటీ పై వస్తున్నారు. రెండు నిమిషాలు అయితే ఆసుపత్రికి చేరుకునే సమయంలో రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ వారి ప్రాణాలను హరించింది. ఈ ప్రమాదంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జంగంపల్లి నుంచి ఆర్టీఏ చెక్ పోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న బిక్కనూర్ ఎ బిక్కనూర్ ఎస్ ఐ లు ఆంజనేయులు, నరేందర్, తన సిబ్బందితో కలిసి ఘటన స్థలం చేరుకుని మృతదేహాలను మార్చురికి పంపి, హైవేపై ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)