ఇన్స్టాగ్రామ్ యూజర్ ప్రిన్స్ సల్మాన్ (@dl06salmanvlogs) భారతదేశ చారిత్రక, పురాతన స్మారక చిహ్నాల గురించి సమాచారాన్ని అందించే కంటెంట్ క్రియేటర్. కొన్ని నెలల క్రితం, అతను తాజ్ మహల్ గురించిన సమాచారాన్ని షేర్ చేశారు. ఈ వీడియోలో, ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన ఆగ్రాలోని తాజ్ మహల్ ఒకే రోజులో ఎంత ఆదాయాన్ని సంపాదిస్తుందో అతను వివరించాడు. వీడియోలో అతను మాట్లాడుతూ రోజుకు 20,000 మంది తాజ్‌మహల్‌ని సందర్శిస్తారని, దాదాపు 2,000 మంది విదేశీయులు ఉన్నారని వివరించాడు. సల్మాన్ తాజ్ మహల్ సంపాదన, తరువాత మొత్తం లెక్కలు వివరించాడు. భారతీయుల టికెట్ 50 రూపాయలు, తాజ్ మహల్ లోపల ఉన్న సమాధికి వెళ్లాలనుకుంటే 200 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా 20 వేల మందిని 50 తో గుణిస్తే అది 10 లక్షల రూపాయలు అవుతుంది. ఈ 20 వేల మందిలో సగం మంది లోపల ఉన్న సమాధిని చూడటానికి వెళితే, వారు 200 రూపాయలు అదనంగా చెల్లిస్తారు. అంటే 10 వేలను 200 లతో గుణిస్తే 20 లక్షల రూపాయలు వస్తుంది. భారతీయుల టికెట్ల ద్వారా 30 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు.
తాజ్‌మహల్ రోజు ఆదాయం 30 లక్షల రూపాయలు ?
October 15, 2025
0
Tags