బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి దీపావళి బొనంజా : రూ.1 చెల్లిస్తే 30 రోజులపాటు విస్తృతమైన మొబైల్ సేవలు

Telugu Lo Computer
0


దీపావళి పండుగను పురస్కరించుకొని బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌కి "బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి బొనంజా" అనే పేరుతో తీసుకొస్తున్నారు. కేవలం రూ.1కే 30 రోజులపాటు అపరిమిత సేవలను అందించే సరికొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ఆఫర్‌తో కేవలం రూ.1 చెల్లిస్తే 30 రోజులపాటు విస్తృతమైన మొబైల్ సేవలను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటా, అలాగే రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్ లు ఉచితంగా లభిస్తాయి. అంతేకాకుండా కొత్తగా సిమ్ కొనుగోలు చేసే వినియోగదారులకు సిమ్ కార్డ్ కూడా ఉచితంగా అందజేస్తారు. ఈ ప్రత్యేక ఆఫర్ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు అమల్లో ఉంటుంది. ఈ కాలంలో కొత్త వినియోగదారులు ఈ ప్లాన్‌ను తీసుకోవచ్చు. ఈ ప్లాన్ కేవలం కొత్త కస్టమర్ల కోసం మాత్రమే రూపొందించబడినట్టు తెలుస్తోంది. ప్రస్తుత బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించదని అంటున్నారు. కొత్త సబ్‌స్క్రైబర్లను ఆకర్షించడానికే ఈ స్కీం తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)