గూగుల్ ఏఐ బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా, కొంతమంది ఉద్యోగులను తగ్గించడం మొదలుపెట్టింది. ఇది ఖర్చులు తగ్గించుకోవడానికి, ఏఐలో పెట్టుబడులను పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తుంది. సీఎన్బీసీకు లభించిన అంతర్గత డాక్యుమెంట్స్ ప్రకారం, ఈ ఉద్యోగాలు యూజర్ల అనుభవాన్ని డేటా ఆధారంగా అర్థం చేసుకోవడంలో, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ వాడినప్పుడు, అందించే సేవలపై యూజర్లు ఎలా స్పందిస్తారో పరిశీలించే విభాగాలను ప్రభావితం చేశాయి. ఈ టీమ్స్ డేటా, సర్వేలు, డిజైన్ రీసర్చ్ ద్వారా యూజర్ ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో కీలకంగా ఉంటాయి. ఇవన్నీ అభివృద్ధికి ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాల్లో, గూగుల్ క్లౌడ్ డిజైన్ టీమ్స్‌ను సగం తగ్గించిందని, ప్రధానంగా అమెరికాలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ ప్రభావితం అయ్యారని తెలుస్తోంది. ఈ ఉద్యోగులకు డిసెంబర్ ప్రారంభం వరకు మరో ఉద్యోగం పొందే అవకాశం ఉంది. గూగుల్ ఈ ఉద్యోగాల తగ్గింపు ఏఐపై వేగంగా దృష్టి పెట్టడంలో భాగంగా చేసిందని చెప్పారు. 2025 ప్రారంభం నుండి అమెరికా యూనిట్లలో స్వచ్ఛంద రిటైర్ ప్యాకేజీలు అందించడం, చిన్న టీమ్‌లను నడిపే మేనేజర్లను తొలగించడం, ఉద్యోగులను రోజువారీ వర్క్‌లో ఏఐ మరింతగా ఉపయోగించమని ప్రోత్సహించడం జరుగుతోంది. ఈ తగ్గింపులు హెచ్ఆర్, హార్డ్‌వేర్, ప్రకటనలు, సెర్చ్, ఫైనాన్స్, కామర్స్ వంటి విభాగాల వరకు విస్తరించాయి. సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులకు 'కంపెనీ పెరుగుతున్న కొద్దీ, మన పని విధానం మరింత సమర్థవంతంగా ఉండాలి.' దీని అర్థం, ఉద్యోగాల తగ్గింపులు తాత్కాలికం కాదు దీర్ఘకాలిక మార్పుకు భాగం. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి టెక్ కంపెనీలు ఏఐలో భారీ పెట్టుబడులు పెడుతూ ప్రత్యర్థులతో ముందుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాయి అని చెప్పారు. గూగుల్ మాత్రమే కాదు, ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ జూలైలో 9,000 ఉద్యోగాలను తొలగించింది. మెటా 2023 నుండి అనేక రౌండ్లలో తొలగింపులు చేసింది. గూగుల్‌లో జరిగే ఉద్యోగాల తగ్గింపుల వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులు తమ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి కొన్ని అవకాశాలను పొందుతున్నారు. కంపెనీ ప్రభావితమైన ఉద్యోగుల కోసం అంతర్గత ఉద్యోగ మార్పు అవకాశాన్ని డిసెంబర్ వరకు ఇస్తోంది, అంటే వారు కంపెనీలోనే మరొక తగిన రోల్‌లో చేరే ప్రయత్నం చేయవచ్చు. అదనంగా స్వచ్ఛంద రిటైర్మెంట్ ప్యాకేజీ లేదా రీటైర్మెంట్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా ఉద్యోగులు ఆర్ధిక భద్రతతో బయటకు రావచ్చు.
ఏఐ బిజినెస్ కోసం వందలాది ఉద్యోగులను తగ్గించిన గూగుల్ !
October 02, 2025
0
Tags