న్యూయార్క్‌లో రెండు వాణిజ్య విమానాలు ఒకదానికొకటి ఢీ !

Telugu Lo Computer
0


మెరికాలోని న్యూయార్క్‌లోగల లగార్డియా విమానాశ్రయంలో బుధవారం రాత్రి  డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు వాణిజ్య విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడికి గాయాలయ్యాయి. అయితే విమానాలు నెమ్మదిగా కదులుతున్న క్రమంలో జరిగినందున పెద్ద ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. లగార్డియా ఎయిర్‌పోర్టులోని ఒక గేటు వద్ద డెల్టా DL5047 విమానం ఆగి ఉంది. అదే సమయంలో, మరో డెల్టా ప్రాంతీయ విమానం DL5155 అదే గేట్ వైపుకి కదులుతోంది. ఈ క్రమంలో రెండో విమానం మొదటి విమానం ముక్కు భాగాన్ని ఢీకొట్టింది. ఢీకొట్టిన తాకిడికి రెక్క విరిగి కిందపడింది. పైలట్లు తమ విండ్‌షీల్డ్‌కు కూడా నష్టం కలిగిందని ఏటీసీ ఆడియోలో వెల్లడించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యాయి. వీడియోలో ఎమర్జెన్సీ వాహనాల లైట్లు వెలుగుతుండగా.. ఒక విమానం రెక్క దెబ్బతినడం స్పష్టంగా కనిపిస్తుంది. ఏటీసీ ఆడియో ప్రకారం, విమానాలు కదులుతున్న సమయంలో ఒకటి మరొకదానికి ఢీకొన్నది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:56 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా డెల్టా ఎయిర్‌లైన్స్ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. DL5047 విమానంలో ప్రయాణికులు ఉన్నారని, ఈ విమానం షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూయార్క్‌కు వచ్చినట్లు పేర్కొన్నారు. ల్యాండింగ్ తర్వాత, రన్‌వేపై కదులుతున్న సమయంలో ఇది మరో డెల్టా విమానం ఢీకు గురై రెక్క విరిగిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)