టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గా సుదీప్ కున్నుమల్ నియమితులైయ్యారు. ఈ మార్పు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఇది అకస్మాత్తుగా వచ్చిన నిర్ణయం కాదు. సుదీప్ కున్నుమల్ టీసీఎస్‌లో 2000 సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు. కున్నుమల్ మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ప్రస్తుతం ఆయన బ్యాంకింగ్, ఆర్థిక సేవలు & బీమా వెర్టికల్‌లో హెచ్‌ఆర్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ విభాగం ఒక్కదానికే టీసీఎస్ ఆదాయంలో "35-40% వాటా" ఉంది. కున్నుమల్ గత 25 ఏళ్లలో ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో హెచ్‌ఆర్ లీడర్‌షిప్ రోల్స్‌లో పని చేశారు. ఉద్యోగుల నియామకం నుంచి, టాలెంట్ డెవలప్‌మెంట్ వరకు మొత్తం లైఫ్‌సైకిల్‌లో ఆయనకు మంచి అనుభవం ఉంది. కంపెనీ మేనేజ్‌మెంట్‌లో మార్పులు, విలీనాలు, కొత్త ఉద్యోగులను ఆన్‌బోర్డ్ చేయడం లాంటి సున్నితమైన విషయాల్లో కున్నుమల్ ముందుండి వ్యవహరించారు.
టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గా సుదీప్ కున్నుమల్
October 02, 2025
0
Tags