తెలంగాణాలో తొలి టెస్లా కారును కొన్న డాక్టర్ ప్రవీణ్ కోడూరు !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని కొంపల్లికి చెందిన డాక్టర్ ప్రవీణ్ కోడూరు టెస్లా కారును ముంబైలోని టెస్లా షోరూమ్ లో కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి టెస్లా కారును కొనుగోలు చేసిన వ్యక్తిగా ప్రవీణ్ కోడూరు నిలిచారు. మన దేశంలో ఇప్పటివరకు ఐదు టెస్లా కార్లు ఉండగా, ఆరో టెస్లా కారును కొనుగోలు చేసిన వ్యక్తిగా డాక్టర్ ప్రవీణ్ కోడూరు నిలిచారు. అయితే ఇతర రాష్ట్రంలో కారు కొన్న కారణంగా ఆయనపై 22 శాతం పన్నుల భారం పడింది. కొంపల్లిలోని శ్రీనందక అడ్వాన్స్‌డ్‌ సర్జరీ సెంటర్‌లో అడ్వాన్స్‌డ్‌ ల్యాప్రోస్కోపిక్‌, లేజర్‌ సర్జన్‌ గా పనిచేస్తున్న చెందిన వైద్యుడు ప్రవీణ్ కోడూరు ఈ కారును కొనుగోలు చేశారు. గత నెల 27న మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలో కారు డెలివరీ తీసుకున్నానని, అక్కడి నుంచి ఆ కారును నడుపుకొంటూ పుణేలో ఒకసారి, షోలాపూర్ లో మరోసారి ఆగి ఛార్జింగ్ చేసుకున్నామని ప్రవీణ్ కోడూరు తెలిపారు. దాదాపు 770 కి. మీ. ప్రయాణించి హైదరాబాద్ వచ్చామని, పక్క రాష్ట్రం లో కొనుగోలు చేయడం వల్ల 22 శాతం అధికంగా టాక్స్ పడిందని తెలిపారు. ఈ కారు ధర రూ. 63 లక్షలు కావాల్సి ఉండగా, 22 శాతం పన్నుల కారణంగా ఖర్చు అమాంతం పెరిగినట్లు ఆయన వివరించారు. హైదరాబాద్‌ కు చెందిన మరో కంపెనీ కూడా టెస్లా కారు బుకింగ్ చేసుకున్నప్పటికీ.. తానే మొదట డెలివరీ తీసుకున్న వ్యక్తిని అని ఆయన తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)