కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టులో హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుపై పిటీషన్ దాఖలు !

Telugu Lo Computer
0


మెరికా లోని కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టులో హెచ్ 1బీ వీసా ఫీజు పెంపును సవాల్ చేస్తూ  పిటీషన్ దాఖలైంది. యూఎస్ కాంగ్రెస్ అనుమతి లేకుండా పన్నులు లేదా ఆదాయాన్ని పెంచే చర్యలను నేరుగా చేపట్టే అధికారం అధ్యక్షుడికి లేదని పిటిషనర్లు వాదించారు. తాజాగా పెంచిన వీసా ఫీజు దీని పరిధిలోకే వస్తుందని తేల్చి చెప్పారు. ఫీజును పెంచడానికి ముందు ట్రంప్, రెగ్యులేటరీ చట్టాలు, అందులో ఉన్న ప్రక్రియను పాటించలేదని వారు పేర్కొన్నారు. తదుపరి వాదోపవాదాలను ఆలకించనుంది. హెచ్ 1బీ విసా పెంపుపై ఓ పిటీషన్ దాఖలు కావడం ఇదే తొలిసారి. దీంతో దీనిపై న్యాయస్థానం నుంచి ఎటువంటి ఆదేశాలు, తీర్పు వెలువడుతుందనేది చర్చనీయాంశమౌతోంది. దీనికి మద్దతుగా మరిన్ని సప్లిమెంటరీ పిటీషన్లు దాఖలు అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. హెచ్ 1బీ విసా ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై కిందటి నెలలో డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన విషయం తెలిసిందే. దీనిపై విదేశాల్లోనే కాకుండా అటు స్వదేశంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అమెరికాలోనూ దీన్ని వ్యతిరేకించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. లక్ష డాలర్ల ఫీజును విధించడాన్ని సవాలు చేస్తూ పలు అసోసియేషన్లను కలిసి ఉమ్మడిగా ఈ పిటీషన్ ను దాఖలు చేశాయి. పలు ఉద్యోగ సంఘాల యూనియన్లు, విద్యావేత్తలు, ఇతర సంఘాలు.. కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అన్యాయమైనదని పేర్కొన్నాయి. దీన్ని నిరంకుశ చర్యగా అభివర్ణించాయి. లక్ష డాలర్ల ఫీజు పెంపు వల్ల ఆసుపత్రులు, ప్రార్థన మందిరాలు, పాఠశాలలు, లాభాపేక్ష లేని సంస్థలు, చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆయా సంస్థలన్నీ కూడా నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులపై ఎక్కువగా ఆధారపడుతుంటాయని, విసా ఫీజు పెంపు వల్ల వాళ్లందరూ అమెరికాకు రావడం తగ్గుతుందని, ఫలితంగా కార్యకలాపాలు స్తంభించిపోతాయని ఆందోళన వ్యక్తం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ పిటీషన్ ను కాలిఫోర్నియా కోర్టు విచారణకు స్వీకరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)