మల్లోజుల, ఆశన్నలను విప్లవద్రోహులుగా ప్రకటిస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ విడుదల !

Telugu Lo Computer
0


మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో ఇటీవల పోలీసులు ఎదుట లొంగిపోయిన మాలోజుల వేణుగోపాల్‌, ఆశన్నలు వంటి నేతల వ్యవహారాన్ని ప్రత్యేకంగా గుర్తించి, వారిని "విప్లవ ద్రోహులు"గా పేర్కొంది. శత్రువుల ఎదుట లొంగిపోయి పార్టీ నష్టానికి కారణమైన నేతలకు తగిన శిక్ష ప్రజలే విధిస్తారని మావోయిస్టు కేంద్ర కమిటీ పేర్కొంది. లేఖలో, మల్లోజుల గత కాలపు తప్పులు, బలహీనతలను కూడా ప్రస్తావించారు. 2018లో పార్టీ తాత్కాలిక వెనుకంజ వేసింది.. 2020లో కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల తప్పుడు భావజాలం, ఆయుధాలను వదిలిపెట్టడంపై వితండవాదం బయటపడింది. ప్రస్తుతం లొంగిపోవడం పార్టీకి తాత్కాలిక నష్టం మాత్రమే అని కమిటీ పేర్కొంది. కమిటీ తన చర్చ లేకుండా మల్లోజుల లొంగిపోయిన విషయాన్ని నిర్దేశిస్తూ, "ప్రాణ భీతితో ఎవరైనా లొంగిపోవచ్చు, కానీ పార్టీకి నష్టం కలిగితే ప్రజలే బుద్ధి చెబుతారు" అని హెచ్చరించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)