హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో రేహన్ మస్కతి తన ఫార్చునర్ కారులో అత్యంత వేగంగా వెళుతున్నాడు. ఈ సమయంలో కారు ముందు వెళ్తున్న వాళ్లని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరు ఆసుపత్రిలో చనిపోయారు. ఆక్సిడెంట్ చేసిన తర్వాత మస్కృతి చాలా నిర్లక్ష్యంగా ఏమి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు తీసి స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే బాధితులను కనీసం పరామర్శించకుండా వాళ్లని ఆసుపత్రి తీసుకొని వెళ్లకుండా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. చావు బతుకుల మధ్య బాధితుడు కొట్టు మిట్టాడుతూ చివరికి ప్రాణం వదిలాడు. ఈ హిట్ అండ్ రన్ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. రెహాన్ మస్కతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మరణానికి కారణమైన అలీ మస్కతి కుమారుడు రేహాన్ మస్కతిపై బీఎన్‌ఎస్ 106(1) సెక్షన్ కింద బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన ఫార్చూనర్ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త అలీ మస్కతి కుమారుడు నిర్లక్ష్య డ్రైవింగ్ కి ఒకరు బలి : ఇద్దరికి తీవ్ర గాయాలయాలు
October 05, 2025
0
Tags