ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న నవ వధువు

Telugu Lo Computer
0


తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండికి చెందిన గంగోత్రి అక్కడే వడ్డెర కాలనీలో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. గంగోత్రి తన ఇంటి ఎదురుగానే ఉంటున్న సంతోష్‌ను ఇష్టపడి, ఇరు వైపులా పెద్దలను ఒప్పించి సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నారు. దసరా తొలి పండుగ కావడంతో ఇద్దరూ కలిసి గంగోత్రి ఇంటికి వచ్చారు. అయితే దసరా రాజున దంపతులిద్దరూ గంగోత్రి తల్లి గారి ఇంటిలో భోజనాలు చేస్తున్న సమయంలో మన ఇంట్లో మటన్ తెస్తే తినని నువ్వు, మీ ఇంట్లో చికెన్ ఎలా తింటున్నావని గంగోత్రిని సంతోష్ ప్రశ్నించాడు. అది కాస్తా ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. ఈ సమయంలో గంగోత్రికి మటన్ అంటే ఇష్టం ఉండదని, చికెన్ తింటుందని ఆమె కుటుంబం సర్ది చెప్పింది. అంతటితో ఆ గొడవ అక్కడితో సద్దుమణిగిందనుకున్నారు. గొడవ జరిగిన తర్వాత ఇద్దరు కలిసి తిరిగి గంగోత్రి అత్తగారింటికి వెళ్లారు. అక్కడ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ గంగోత్రి అత్తగారింటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో అంతా షాకయ్యారు. గొడవను మనసులో పెట్టుకుని తన కూతురును బలవంతంగా తీసుకు వెళ్లారని గంగోత్రి తల్లి శారద ఆరోపిస్తోంది. మరోవైపు ఆమె మృతికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదని బంధువులు అంటున్నారు. మొత్తంగా ఆమె చనిపోవడం బాధాకరమని చెబుతున్నారు. ఆరు సంవత్సరాలు ప్రేమించి, పెళ్లి చేసుకున్న తర్వాత ఆరు రోజులు కూడా కాపురం చేయక మునుపే నవ వధువు సూసైడ్ చేసుకోవడం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)