హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా గాంధీ

Telugu Lo Computer
0


హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వీరభద్ర సింగ్ విగ్రహాన్ని కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ ఆవిష్కరించారు. ప్రియాంక గాంధీ కూడా సోనియా వెంట ఉన్నారు. ఆదివారం సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్‌లో వీరభద్ర సింగ్ విగ్రహాన్ని సోనియా గాంధీ ఆవిష్కరించారు. ప్రియాంక గాంధీ, వీరభద్ర సింగ్ భార్య, కుమారుడు, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఇతర కాంగ్రెస్‌ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తూ వీరభద్ర సింగ్‌ను 'హిమాచల్ ఆత్మ'గా అభివర్ణించారు. 'నేడు దేశంలో వీరభద్ర సింగ్ లాంటి నిజమైన నాయకుల కొరత ఉన్నదని, ఆయన తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు ఒక మాధ్యమం. అధికారం అంటే బాధ్యత అని భావించే మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల సంప్రదాయాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లారు' అని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం విభజన, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో హిమాచల్‌ప్రదేశ్‌ను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. 'హిమాచల్‌లో ఇల్లు ఉన్నందుకు నాకు గర్వంగా ఉన్నది. ఈ భూమి మాకు ప్రేమ, ప్రేరణను ఇస్తుంది' అని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)