తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ బీఆర్కే భవన్‌లో ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్ నేతలు ప్రలోభపెడుతున్నారని, ఓటర్లను భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నేతలు పెద్ద కుట్రకు తెరలేపారని ఆక్షేపించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటుంటే , జూబ్లీహిల్స్‌లో మాత్రం కాంగ్రెస్ నేతలే చోర్ ఓట్‌కి పాల్పడుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 20 వేల దొంగ ఓట్లు సృష్టించారని, ఆధారాలతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశామని తెలిపారు. కొవ్వూరి కార్తీక్ పేరుతో మూడు చోట్ల ఓటు ఉందని, దీపక్ శర్మ అనే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. కింది స్థాయి అధికారులు కాంగ్రెస్‌తో కుమ్మక్కై దొంగ ఓట్లను సృష్టించారని మండిపడ్డారు. దొంగ ఓట్ల పైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కైన కింది స్థాయి అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరారు. నామినేషన్‌ల పక్రియ పూర్తి అయ్యేలోపు 20 వేల దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది !
October 13, 2025
0
Tags