మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను పోలీసుల ఎదుట లొంగిపోయారు. దాదాపు 60 మంది మావోయిస్టులతో కలిసి మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఎదుట ఆయన లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల మల్లోజుల లేఖ విడుదల చేసిన విషయం విదితమే. 2026, మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దేశంలో మావోయిస్టులను దాదాపుగా నిర్మూలించింది. అలాగే ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యాన్ని సైతం భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పటికే భద్రత బలగాల చేతిలో వందలాది మంది మావోయిస్టులు మరణించగా.. పలువురిని అరెస్ట్ చేశారు. ఇక మృతి చెందిన మావోయిస్టుల జాబితాలో ఆ పార్టీ అగ్రనేతలు సైతం ఉన్న సంగతి తెలిసిందే. మంగళవారం మావోయిస్టు అగ్రనేత లొంగిపోయిన కొద్దిసేపటికే వారు నిల్వ ఉంచి ఆయుధాలను సైతం భద్రతా బలగాలు భారీ ఎత్తున స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు
October 14, 2025
0
Tags