హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ యువ మహిళా క్రికెటర్లు భారత అండర్-19 వుమెన్ జట్టులో చోటు కోసం పోటీపడే సువర్హావకాశం కల్పించింది. ఇందుకోసం అక్టోబరు 15, 16 తేదీల్లో ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందులో సత్తా చాటిన మహిళా క్రికెటర్లు 2025-26 సీజన్‌కు గానూ భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే టోర్నీల్లో భాగం కావొచ్చని హెచ్‌సీఏ ఈ సందర్భంగా తెలిపింది. ఇక పోటీల్లో పాల్గొనాలనుకునే మహిళా క్రికెటర్లకు ఉండాల్సిన అర్హతలను కూడా మంగళవారం వెల్లడించింది. ప్రతి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఈ నోటిఫికేషన్ గురించి స్థానిక ప్లేయర్లకు సమాచారం అందించాలని ఆదేశించింది. అక్టోబరు 15 2025న ఉదయం తొమ్మిది గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆరంభం. మధ్యాహ్నం 12- సాయంత్రం 5 గంటలకు వరకు ట్రయల్స్. అక్టోబరు 16న కూడా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రిజిస్ట్రేషన్, ట్రయల్స్ ప్రక్రియ.
యువ మహిళా క్రికెటర్లు భారత అండర్-19 వుమెన్ జట్టులో చోటు కోసం పోటీపడే అవకాశం
October 14, 2025
0
Tags