అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోడీ భయపడుతున్నారు. రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ ప్రకటన చేసేందుకు ప్రధాని అనుమతించారు. అమెరికా పదేపదే తిడుతున్నా కూడా అవేవీ పట్టించుకోకుండా వారిని అభినందిస్తూ శుభాకాంక్షల మెసేజీలు పంపుతూనే ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆర్థికమంత్రి అమెరికా పర్యటనను రద్దు చేశారు. ఈజిప్టులోని షర్మ్-ఎల్ షేక్‌లో సోమవారం జరిగిన గాజా శాంతి ఒప్పందం కార్యక్రమానికి ప్రధాని వెళ్లలేదు. ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ ప్రకటనలను ఖండించట్లేదని రాహుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోడీ భయపడుతున్నారు : రాహుల్ గాంధీ ట్వీట్
October 16, 2025
0
Tags