చెన్నైలోని నీలంకరైలో గల విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. గురువారం ఉదయం చెన్నై పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. భవిష్యత్తులో విజయ్ గనుక పబ్లిక్ ర్యాలీలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఆయన ఇంటిని బాంబుతో పేల్చేస్తానని బెదిరించారు. ఈ బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన చెన్నై పోలీసులు విజయ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ఫోన్ కాల్ కన్యాకుమారి నుంచి వచ్చినట్లు గుర్తించారు. కాగా, కరూర్ ఘటన తర్వాత విజయ్‌కి ఇలా బెదిరింపులు రావడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. విజయ్‌తోపాటూ ఇటీవలే కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సినీ తారలు త్రిష, నయనతార నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీసుకి, రాజ్‌భవన్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి.
భవిష్యత్తులో పబ్లిక్ ర్యాలీలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు : విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు
October 09, 2025
0
Tags