శాంసంగ్‌ నుంచి గ్యాలక్సీ A07, గ్యాలక్సీ F07, గ్యాలక్సీ M07 4G స్మార్ట్‌ఫోన్‌ల విడుదల

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో  శాంసంగ్‌ బడ్జెట్ శ్రేణిలో గ్యాలక్సీ A07, గ్యాలక్సీ F07, గ్యాలక్సీ M07 4Gలను విడుదల చేసింది. ఈ ఫోన్‌లన్నీ దాదాపుగా ఒకే ఫీచర్స్ కలిగి ఉన్నాయి. మూడు స్మార్ట్‌ఫోన్‌ల పేర్లు, కలర్స్, ధరలలో మాత్రమే తేడాలు ఉన్నాయి. ఈ మూడు ఫోన్స్ వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి. మూడు స్మార్ట్‌ఫోన్‌లు 6.7 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇందులో 50 ఎంపీ బ్యాక్ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. గ్యాలక్సీ A07 4Gని కంపెనీ రూ.8,999కి లాంచ్ చేసింది. ఈ ఫోన్లు నలుపు, ఆకుపచ్చ, లేత వయొలెట్ రంగులలో వున్నాయి. వీటిని శాంసంగ్‌ అధికారిక స్టోర్ నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.గ్యాలక్సీ F07 ఫోన్ రూ.7,699కి లాంచ్ చేయబడింది. ఈ ఫోన్  ఆకుపచ్చ రంగులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. గ్యాలక్సీ M07 4Gని రూ.6,999కి విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకంగా అమెజాన్‌లో లభిస్తుంది. ఈ మూడు హ్యాండ్‌సెట్‌లన్నీ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌లో అందుబాటులో ఉంటాయి. మూడు ఫోన్‌లలో 90Hz రిఫ్రెష్ రేట్‌, IP54 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డ్‌ని ఉపయోగించి ఫోన్ స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించవచ్చు. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు Android 15 ఆధారంగా One UI 7పై రన్ అవుతాయి. మూడింటిలో కంపెనీ ఆరు ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. మూడు ఫోన్‌లు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్‌తో వస్తాయి. కంపెనీ 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించింది. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 25W ఛార్జింగ్‌, 4G మద్దతుతో వస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)