విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ

Telugu Lo Computer
0


విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి పై వాహనాల రద్దీ పెరిగిపోయింది. దసరా సెలవులు ముగియడంతో పల్లెలలో పండుగ జరుపుకున్న ప్రజలు తిరిగి నగరాలకు బయలుదేరడంతో హైవే పై భారీ ట్రాఫిక్‌ కనిపిస్తోంది. కార్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు వరసగా కదులుతూ పొడవైన క్యూలు ఏర్పడ్డాయి. చిట్యాల, చౌటుప్పల్‌, పంతంగి టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల క్యూలు కిలోమీటర్ల దూరం వరకూ కొనసాగుతున్నాయి. వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతుండగా, బస్సులు ప్రయాణికులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా ఉండేందుకు పోలీసులు ఫీల్డ్‌లో వాహనాలను క్రమబద్ధీకరిస్తూ పరిస్థితిని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)