తల్లి మందలించిందని కూరగాయల కత్తితో గొంతు కోసి హతమార్చిన తనయుడు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరు,  శ్రీరామ్‌ నగర్‌లో తల్లి మందలించిందని కుమారుడు కూరగాయల కత్తితో ఆమె గొంతు కోసి హతమార్చాడు.  తల్లి లక్ష్మీదేవి వంటింట్లో ఉండగా కుమారుడు యశ్వంత్‌రెడ్డి గొడవపడ్డాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురై కత్తితో ఆమె గొంతు కోశాడు. హత్య సమయంలో తండ్రిని గదిలో యశ్వంత్‌ బంధించాడు. మతురాలు లక్ష్మీదేవి ఈశ్వర్‌రెడ్డి నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. నిందితుడు యశ్వంత్‌ బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)