ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం : రిక్టర్‌ స్కేల్‌పై 7.4గా నమోదు !

Telugu Lo Computer
0


ఫిలిప్పైన్స్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఇద్దరు మరణించారు. ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలకు అధికారులు సునామీ హెచ్చరికల్ని జారీ చేశారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపంలో మనారు పట్టణ తీరంలో 43 కిలోమ్టీర్ల లోతులో ఈరోజు ఉదయం 9.43 గంటల సమయంలో భూకంపం సంభవించిందని ఫిలిప్పీన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వోల్కనాలజీ అండ్‌ సిస్మోలజీ (ఫివోల్క్స్‌) కేంద్రం తెలిపింది. ఈ భూకంప నేపథ్యంలో పసిఫిక్‌ తీరంలో భారీగా అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భూమి కంపించడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)