720 కోట్ల రూపాయల విలువైన 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా !

Telugu Lo Computer
0


తెలంగాణ హైకోర్టు తీర్పు మేరకు ఇవాళ ఉదయం నుంచి కొండాపూర్ లోని బిక్షపతి నగర్ ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణల తొలగింపును భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది చేపట్టింది. తాత్కాలిక షెడ్డులను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని ఖాళీ చేయించింది. దీంతో దాదాపు 720 కోట్ల రూపాయల విలవ చేసే 36 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. అయితే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి సమీపంలోని సర్వే నంబర్ 59లో 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంత మంది కబ్జా చేశారని హైడ్రా తెలిపింది. దీనిపై గతంలో రైతులకు అనుకూలంగా రంగారెడ్డి జిల్లా సివిల్ కోర్టు తీర్పు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పును హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. దీంతో ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.  

Post a Comment

0Comments

Post a Comment (0)