గుజరాత్లో 26 మందితో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం : రీవాబా జడేజాకు మంత్రి పదవి

Telugu Lo Computer
0


గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గం అంతా నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు 26 మంది కొత్త మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు హోం మంత్రిగా ఉన్న హర్ష్ సంఘ్వీని డిప్యూటీ సీఎం పదవి వరించింది. గాంధీనగర్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ ఆచార్య దేవ్ రత్ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రిగా హర్ష్ సంఘ్వీ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రి వర్గంలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవాబా జడేజా స్థానం సంపాదించుకున్నారు.  మంత్రి వర్గం పునఃవ్యవస్థీకరణలో భాగంగా రాజీనామా చేసిన మంత్రులలో నలుగురు మంత్రి పదవిని దక్కించుకున్నారు. అందులో రిషికేష్ పటేల్, కనుభాయి దేశాయ్, కున్వర్ జీ బవాలియా, పర్షోత్తం సోలంకి ఉన్నారు. వీరికి మొదటి పోర్ట్ ఫోలియోలే కేటాయించడంతో ప్రమాణ స్వీకారం చేయలేదు. వీరితో పాటు గుజరాత్ లో ప్రముఖ కుటుంబాల నుంచి ప్రఫుల్ పన్సేరియా, సంఘ్వీ కొత్త మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నివాసంలో జరిగిన సమావేశంలో అధిష్టానం సూచన మేరకు ఒక్క ముఖ్యమంత్రి తప్ప మంత్రులంతా రాజీనామా చేయాలని నిర్ణయించారు. మొత్తం 16 మంది మంత్రులు తమ రాజీనామాలను ముఖ్యమంత్రికి సమర్పించారు. రాష్ట్రంలో మంత్రుల సంఖ్య16 నుంచి 26 కు చేరుకుంది. 182 మంది సభ్యులు ఉండే గుజరాత్ అసెంబ్లీలో గరిష్టంగా 27 మంది మంత్రులు ఉండవచ్చు.



Post a Comment

0Comments

Post a Comment (0)