ఆకాశ ఎయిర్ విమాన టికెట్లపై 20 శాతం వరకు తగ్గింపు !

Telugu Lo Computer
0


దీపావళి సందర్భంగా విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్  ప్రయాణికుల కోసం పలు ఆఫర్లను ప్రకటించింది. విమాన టికెట్లపై 20 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. 'ఆకాశ20' అనే వోచర్ కోడ్ ఉపయోగించి ఈ డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది. అంతేకాకుండా, ఎంపిక చేసిన సీట్లపై 30 శాతం, అదనపు లగేజీపై 10 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 31 వరకు విమానాల్లో ప్రత్యేక దీపావళి భోజనాన్ని కూడా అందిస్తుండటం విశేషం. మరోవైపు, ఇండిగో కూడా ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకొచ్చింది. ఈ ఆఫర్ నేటితో ముగియనుంది. దీని కింద దేశీయ ప్రయాణాలకు టికెట్ ధరలు రూ.2,390 నుంచి, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.8,990 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. 2025 నవంబర్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.అంతర్జాతీయ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఖతార్ ఎయిర్‌వేస్ కూడా దీపావళి ఆఫర్‌ను ప్రకటించింది. భారత్‌లోని 13 నగరాల నుంచి అమెరికా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు వెళ్లే టికెట్లపై 25 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అక్టోబర్ 23 లోపు టికెట్లు బుక్ చేసుకున్న వారు 2026 మార్చి 31 వరకు ప్రయాణించవచ్చని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)